April 15, 2020

గౌరవం

మానవ జీవితం లొ గౌరవం కి ఒక విశిష్ట స్థానం ఉంది. మన దైనందిన జీవితం లో ఒక ప్రాముఖ్యత ఉంది. భార్యా భర్త , తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, సహ ఉద్యోగులు, అందరూ పరస్పరం గౌరవం కోరుకుంటారు,  ఆశ పదతారు, తపన పదతారు.  కొంత మంది అయితే  గదమాయించి అడుగుతారు కూడ. అనుకున్నట్టు అందరూ గౌరవిస్తే సంతొషమే, కాని ఎల్లవేళలా అది జరిగే పని కాదు. అప్పుడే  చిక్కులు మొదలవుతాయి. గట్టిగా అడిగితే వచ్చేది కాదు. స్వయం చాలకం గా తనంతట తనే వచ్చేది కాదు. అది మన హక్కులా నొక్కించి అదగలేము. దబాయించలేము.  వారి గౌరవానికి పాత్రులమని, మనల్ని గౌరవించాలని ఎదుటి వారికి అనిపించాలి. మనకా అర్హత ఉండాలి. ఆ అర్హతలేమిటో 
పరిశీ లించే   ముందుగా , ఆశించిన గౌరవం లభించక పోతే ఏమి జరుగుతుందో గమనిద్దాం. చాల కోపం వస్తుంది. కలవరపెడుతుంది. నొక్కిస్తాం. అయినా దొరకలేదు. పిచ్ఛేక్కిపోతుంది. దుర్మార్గపు అలోచనలు మొదలవుతాయి. దౌర్జన్యానికి దిగుతారు. కుట్ర లూ , కుతంత్రాలూ, మొదలవుతాయి. మానవ సంబంధాలు గాలిలో కలిసిపో తాయి. స్నేహితులు కూదా శత్రువులైపోతారు. సన్నిహితులు దూరమై పోతారు. ఇక నరకం లోకి ఎంట్రీ.

అసలు గౌరవం అంటే ఏమిటి

ఒక విషయం మీద కాని, ఒక వ్యక్తి మీద కాని వాళ్ళ శక్తి సామర్ధ్యాల మీద, వారి వ్యక్తిత్వం మీద , వారు సాధించిన విజయాల పట్ల  అమితమైన మెప్పు కలిగితే , ఆ భావననే గౌరవం గా చెప్పుకోవచ్చు. గౌరవం అంటే ఎదుటి వారి భావాలని, హక్కులని పరిగణ లోకి తీసుకుని ప్రవర్తించడం .  ఎదుటి వారితో మనం ప్రవర్తించే తీరు , వారి పట్ల మన అలోచనా ధోరణి,  మనం చూపే మర్యాద గాని, దయ లేదా మంచితనం గాని వారి పట్ల మనకున్న గౌరవాన్ని తెలియచేస్తాయి .

గౌరవం ఎలా దొరుకుతుంది ?

మన చదువు, ధనం , పదవి, హోదా, శ్రేణి కొంతవరకు మనకు లభించే గౌరవానికి దోహద పడతాయి. మన దేశం లో వయస్సులో పెద్దవారికి, ఉపాధ్యాయులకి , తల్లిదండ్రులకి, యజమానికి వారి వారి స్థానాన్ని బట్టి గౌరవం ఇవ్వడం రివాజు. నిజంగా వారికి ఆ అర్హత ఉందా లేదా అని అలొచించం . ఎటొచ్చి పదవి, హొదా వంటివి  పరిస్థితులని  బట్టి త్వరగా మారిపోతాయి.  ఎందుకంటే, ఏ పదవి కాని, హొదా కాని ఎప్పటికీ ఉండదు. దీర్ఘ కాలం మనకు గౌరవం లభించాలి అంటే, మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం, మన వైఖరి , మాట తీరు, మన వ్యవహార శైలి బాగుండాలి . గౌరవం అనేది మనం కష్టపడి  సంపాదించుకోవాలి.  ఏలా అనేది ముఖ్య ప్రశ్న.

ఒక్కొక్క సంప్రదాయం లో ఒక్కొక్క విధంగా గౌరవాన్ని తెలియ చేస్థారు. మన దేశం లో నమస్కారం పెడతారు. కొన్ని దేశాల్లో  ముందుకు వంగుంటారు. గౌరవించాల్సిన  వ్యక్తి వచ్చ్చినప్పుడు మనం లేచి నుంచుంటాం. ఎవరినైనా అవమానించినా, వారితో దురుసుగా ప్రవర్థించినా వాళ్ళని గౌరవించినట్లు కాదు. గౌరవం అంటే ఎదుటి వారిని, వాళ్ళు  మనకన్నా భిన్నం గా ఉన్నప్పిటికీ, మనం వాళ్ళతో ఏకీభవించ నప్పటికీ,  వాళ్ళని వాళ్ళుగా అంగీకరించదం. మన సంబంధాలలో గౌరవం ఉంటె అది నమ్మకాన్ని, భద్రతనీ, సహ్రుద్భావాన్ని పెంపొదించేది గా ఉంటుంది. గౌరవం మన సంబంధాలు పటిష్టం గా ఉండేన్దుకు తోడ్పడుతుంది. మనం మర్యాదతో, గౌరవం తో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి.  ఒకవేళ ఎవరైనా మనతో దానికి విరుధం గా ప్రవర్తిస్తే మనం ఏమి చెయ్యలో కూడ తెలుసుకోవాలి. 

గౌరవానికి  ఎందుకీ ప్రాముఖ్యత

మనకి గౌరవం లభించినప్పుడల్లా మనకు భద్రతా భావం ఉంటుంది, దానివల్ల మన భావాల్ని స్వేచ్చ్గ గా  వ్యక్త  పరచగలుగుతాం. మనలో అంతర్గతంగా ఉన్న అహం సంతృప్తి పొందుతుంది.  అది మనకు బాగా అనిపిస్తుంది. 

ఈ గౌరవం అనేది చూడ్డానికి ఎలా ఉంటుంది?

దాన్ని మనం ఎలా కనుక్కోగలం? మన సంబధాలలో గౌరవం ఉంది అని మనం ఎలా తెలుసుకోగలం?  ఈ విషయాల గురించి తప్పనిసరిగా అందరూ తెలుసు కోవాలి, నేర్చుకోవాలి.  మన సంబంధాలు గౌరవంతో కూడి ఉంటే:
  • మన సహచర్యం లో భద్రతా భావన ఉంటుంది, స్వేచ్చ ఉంటుంది.
  • మనం ఎవరో, ఏమనుకుంటున్నామో  చెప్పడానికి మనం వెనుకాడం.
  • ఎదుటి వారితో మనం అంగీకరించక పోయినా, వారి వాదనను ఓపికతొ వినడానికి సిధ్హం గా ఉంటాం.
  • ఒకరికన్నా మరొకరు గట్టిగా మట్లాడుతూ , ఆధిక్యం చూపించే ప్రయత్నం చెయ్యం.
  • ఒకరు మరొకరిని నియంత్రణ చెయ్యడానికి చూడం.
  • ఎవరికి వారు తమ తమ అభిప్రాయాల్ని, అవసరాలిని , కోరికలనీ  స్వేఛగా వెలువరిస్తారు.
  • ఇద్దరూ తమ మధ్య అవసరమైన వ్యక్తిగత దూరాన్ని పాటిస్తారు.
  • తమ తమ తప్పుల్ని ఒప్పుకోవడానికి సంకోచించరు.

ఇతరులనించి   ఆశించని గౌరవం రాకపోతే ఏమి చెయ్యాలి?


ఒక్కొక్క సారి మన కుటుంబ సుభ్యులు కాని, స్నేహితులు కాని మనకి ఇవ్వల్సిన గౌరవం ఇవ్వలెదనిపిస్తుంది. మనం ఇతరులని మార్చేసి , వాళ్ళ గౌరవాన్ని పొందడం  సాధ్య పడే విషయం కాదు. అయితే మనం చెయ్యగలిగిన పనులు కొన్ని ఉన్నాయి. మన ప్రవర్తన, మాట తీరు, ధోరణి తో ఎదుటి వారిని కొంతవరకు ప్రభావితం చెయ్య వచ్చు. కొన్ని సూచనలు:
  • ఎదుటి వారితో గౌరవంగా ఉంటూ, గౌరవించడం అంటే ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ గా చూపెట్టవచ్చు
  • వారి ప్రవర్తన కాని, మాటలు గాని మనకు  నచ్చకపోతే నచ్చట్లేదని సూటిగా స్పష్తంగా, నిర్దిష్టంగా చెప్పాలి.
  • వారి దృక్పథం  అర్ధం చేసుకోడానికి ప్రయత్నం చెయ్యాలి.
  • గౌరవం తెలిసిన మనుషులతో సన్నిహితం గానూ, తెలియని వారితో దూరం గానూ ఉండాలి 
  • వారు మన పట్ల వారి ప్రవర్తన మార్చుకునే అవకాశం ఇవ్వాలి 
  • మనల్ని గౌరవించని వారి స్నేహానికి ముగింపు చెప్పడం లో తప్పు లేదు,  ఎందుకంటే వారితో కలిసి ఉండడం లో మనకు భద్రత లేదు, ఆనందం లేదు.

ఇతరుల గౌరవం పొందడానికి మనకు ఉండవలసిన అర్హతలేమిటి ?


కోపానికి , ఆగ్రహానికి, ద్వేషానికి, అసూయకి, నిరాశకి, తగువులకి, మనస్పర్ధలకి ముఖ్య కారణం అనుకున్న గౌరవం లభించక పోవదమే అంటే ఆశ్చర్య పోవక్కరలేదు. చాల మంది గౌరవం కావాలని కోరుకుంటారు. కాని అది పొందడానికి ఒక అర్హత ఉండాలని కూడా వారికి తెలియదు . మనం ఏమి చేస్తే ఆ అర్హత పొంద గలమో, దానికి మన  ప్రవర్తన ఎలా ఉండాలో గమనిద్దాం :
  • మనం చెప్పే ప్రతీ మాట, చేసే ప్రతివాగ్దానం, చిన్నదైనా పెద్దదైనా,  మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే మన మాటకి మనం కట్టుబడి ఉండాలి.  ఒక పని చేస్తామంటే చేసి తీరాలి, నిజాయతీ లేక పోతే మనల్ని ప్రజలు నమ్మరు, గౌరవించరు.
  • ఎవరికైనా కాలం చాల విలువైన వనరు. అవసరానికి మించి మాట్లాడుతూ, పనుల్లో జాప్యం చేస్తూ  ఎదుటి వారి కాలాన్ని మనం వృథా  చేస్తే మనకి గౌరవం లభించదు.
  •  ఎదుటి వారి గురించి వారి సమక్షం లో కాని, పరోక్షం లో కాని చెడుగా మాట్లాడ కూడదు.  
  •  ప్రతి చిన్న విషయానికి , పెద్ద విషయానికి క్షమించమని కోరుతూ ఉండ కూడదు. కొంతమంది ప్రతి సంభాషణ సారీతో మొదలు పెడతారు. వారి మీద వారికె గౌరవం లేదు, మనకెలా ఉంటుంది?
  • మనం నమ్మిన విలువలకి కట్టుబడి ఉండాలి.
  • అవసరానికి మించి మంచిగా ఉంటే, అది మన బలహీనత గా చూస్తారు, గౌరవం ఇవ్వరు.
  • ఎవరైనా నీతో సరిగా ప్రవర్తించకపోతే , వెంటనేనిక్కచ్చిగా చెప్పాలి, సంకొచించ కూడదు. భరిస్తూపోతే  గౌరవం లేదు.
  • వేరే ఎవరికైనా అన్యాయం జరిగితే, మనకెందుకులే అని ఊరికే ఉండ కూడదు. వారి గురించి మనం నిలబడ గలగాలి. 
  • నీకై నువ్వు నిలబడాలి.
  • ఇతరుల సంరక్షణ   మీద శ్రద్ధ  పెట్టాలి.
  • మీరు చేసే పని మీద పూర్తి సామర్ధ్యం ఉందాలి. సమర్ధుడైన  వ్యక్తి ని ప్రజలు గౌరవిస్తారు.
  • ఎక్కడికి వెళ్ళినా మనం విలువచేర్చే విధం గా ఉండాలి . మన వల్ల ఎదుటి వారికి ప్రయోజనం చేకూరాలి, అంటే ఏదైనా సమస్య ఉంటే తగిన పరిష్కారం చూపకలిగేలా ఉండాలి.
  • వీలైన సహాయాన్ని అందించడానికి ముందుకు రావాలి. మీ చొరవను ప్రజలు గుర్తిస్తారు, గౌరవిస్తారు.
  • మన ప్రతిస్పందన తెలియచేసే ముందు ఆలోచించాలి. ఎదుటి వారి పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. మన మాటలోమన భావోద్వేగం ప్రదర్శించడంలో  ఒక నియంత్రణక్రమశిక్శణ ఉండాలిమీ భావోద్వేగాలని అదుపు లో ఉంచుకోవాలి. తగిన మోతాదులో మాత్రమే మన ఎమోషన్ ప్రదర్శించాలి. అలా చెయ్యనివాణ్ణి చులకన గా చూస్తారు.
  • మీ మాటలు ఇతరులను ఉత్తేజ పరిచేలా, సకారాత్మకంగా ఉండాలి.
  • ఇతరుల నుంచి గౌరవం పొందాలంటె, ముందుగా మనం వారిని గౌరవించాలి.  ఎదుటి వారు మనతో ఎలా ప్రవర్తించాలని మనం కోరుకుంటామోమనం వారితొ అలానే ప్రవర్తించాలి. దీన్ని గొల్డెన్ రూల్ అని అంటారు.
  • మనల్ని మనం గౌరవించుకొవాలి, అప్పడే  ఇతరుల గౌరవం పొంద గలం
  •  అవసరానికి మించి మాట్లాడితె మనకి గౌరవం లభించదు, మన మాటకి విలువ తక్కువ ఉంటుంది. అలాగే ఎక్కువగా నవ్వే వారిని, నవ్వించేవారినీ అంత గంభీరం  గా తీసుకోరు.

మనకి ఎప్పుడూ గౌరవం వచ్చే విధం గా ఎలా ప్రవర్తించాలి?

  • ఎవరు మన కాలాన్ని వ్రుధా చేసినా మనం సహించం, అడ్డుకుంటాం , సాధ్య పడనివ్వం, రక్షించుకుంటాం. మన కాలం విలువైనది అని స్పష్టం గా తెలియచేస్తాం.
  • మన విలువలు మన వ్యక్తిత్వాన్ని తెలియచేస్తాయి. క్రమశిక్షణ, మంచితనం, మృదు  భాషణ, దయ, వినయం, మన మాటల్లో , చేతల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
  • మనం నమ్మిన నిజాన్ని నొక్కి చెప్పటానికి సందేహించం. తటపటాయించం.
  • మనం ఎవరితోనైనా ఎక్కువ సన్నిహితంగా గడిపితే మన విలువ తగ్గే ప్రమాదం ఉంది. అటువంటి పరిస్థితి ఎదురైతే కొంచెం దూరం పెంచడం మంచిది. దూరం ఎక్కువ అయితే గౌరవం పెరిగే అవకాశం ఉంది.
  • ఎల్లప్పుదూ అవసరానికన్నా తక్కువ మాట్లాద్దం మంచిది.
  •  ఎదుటి వారు మాట్లాడుతున్నప్పుడు పూర్తి శ్రద్ధ తో వినడం మనకు వారి పట్ల గౌరవాన్ని తెలియచేస్తుంది. మనం వేరే పని చేసుకున్నా, మన ధ్యాస అక్కడ లేక పోయినా దాన్ని అగౌరవంగా పరిగణించ వచ్చు. ఈ మధ్య కాలంలో , చాలా మంది ఎల్లప్పుడూ సెల్ ఫోనులో  చూసుకుంటూ ఉంటారు. మనం మాట్లాడుతూనే ఉంటాం, వారు ఫోను చూసుకుంటూనే ఉంటారు. అంతకన్నా అమర్యాద లేదు. 
  •  ఎవరినైనా వారి సలహా గాని, అభిప్రాయం గాని అడిగి తెలుసుకుంటె అది వారి పట్ల మన  కున్న నమ్మకాన్ని, గౌరవాన్ని తెలియచేస్తుంది. చాల సార్లు మన నిర్ణయాలు మనం తీసేసుకుంటాం. మన ఎదురుగా అనుభవజ్నులూ , పండితులూ ఉన్నప్పటికీ వారిని మనం ఒక్క మాట కూడ అడగం. అడగాలని కూడ మనకు అనిపించదు. మనం అడిగితే మేము సలహా ఇచ్చే వాళ్ళంగదా అని వాళ్ళు అనుకుంటారు. మనం అడగలేదని వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు.
  • మనం చూడడానికి ఎలా కనిపుస్తున్నాం  అని అలోచించాలి. వేషం, భాష లో మర్యాద ఉండాలి , నాగరికత ఉండాలి
  • వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ ; వకార పంచకోపేతం నరః  ప్రాప్నోతి గౌరవం అని పెద్దవాళ్ళు చెప్పారు. మనిషికి గౌరవం లభించాలి అంటె ఈ అయిదు సరిగా ఉండాలి – మన బట్టలు, మనం కనిపించే తీరు, భాష, చదువు, వినయం.  వీటిని బట్టి మనల్ని అంచనా వేస్తారు. గౌరవం ఇస్తారు.
  • స్వతంత్రం గా ఆలోచించ గలిగినవాడు మాత్రమే గౌరవాన్ని పొందగలడు. మరొకరిచేత నడిపించబడే వాడు గౌరవాన్ని పొందలేడు. సంప్రదాయ భీరువుకీ, అస్వతంత్ర వితంతువుకీ వసంతం లేదు అని తిలక్ అనలేదా!



1   
1   









4 comments:

  1. Very apt for obtaining respect. As pointed out first we must respect ourselves. At the same time we should not be too dependent on others tespect. Great peace

    ReplyDelete
    Replies
    1. Thank you Ravi Kumar for your comments. As I mentìoned, respect has to be earned by our behaviour, qualities and achievements.

      Delete
  2. ప్రకృతికి సృష్టిలోని సమస్త చరాచర జీవులకు చెందవలసిన కనీస " గౌరవ మర్యాదలు" కరువైన ఈ తరుణంలో ఈ వ్యాసం సర్వత్రా సమయోచితం , హర్షణీయం.

    ReplyDelete
  3. అందరికీ కావాలి. ఎవరూ ఇవ్వరు. అందుకే ఈ చిన్న ప్రయత్నం. ధన్యవాదాలు.

    ReplyDelete